: నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు భేటీ... విశాఖ స్మార్ట్ సిటీపై పవర్ పాయింట్ ప్రజంటేషన్!
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ‘ఏ మేకింగ్ ఆఫ్ విశాఖ స్మార్ట్ సిటీ’ అనే అంశంపై కేంద్ర మంత్రి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఇటీవల హుదూద్ తుపాను నేపథ్యంలో జరిగిన బీభత్సం, అనంతరం నగరంలో సాధారణ పరిస్థితుల పునరుద్ధరణ, కేంద్రం ప్రతిపాదించిన స్మార్ట్ సిటీ పథకం తదితరాలపై ఆమె చంద్రబాబుకు సమగ్ర వివరాలు అందజేశారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ను ఆసక్తిగా తిలకించిన చంద్రబాబు, తమ అధికారులతో చర్చించి సమాధానమిస్తామని నిర్మలా సీతారామన్ కు తెలిపారు. మరికొద్దిసేపట్లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతితోనూ చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ భేటీ తర్వాత మరింత మంది కేంద్ర మంత్రులను ఆయన కలవనున్నట్లు సమాచారం.