: భారీ లాభాల బాటలో స్టాక్ మార్కెట్
ఆర్బీఐ పరపతి విధాన మార్పులు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంటును అమాంతం పెంచాయి. దీంతో, ముడిచమురు ధరల పతనాన్ని మరచి కొత్త కొనుగోళ్లు వెల్లువెత్తాయి. నేటి సెషన్లో బీఎస్ఈ సెన్సెక్స్ 28 వేల మార్కును అధిగమించింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో సెన్సెక్స్ 660 పాయింట్ల లాభంతో 28006 వద్ద, నిఫ్టీ 196 పాయింట్ల లాభంతో 8473 వద్ద కొనసాగుతున్నాయి. ఈ ఉదయం రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించిన సంగతి తెలిసిందే.