: రెండు వేల మంది భక్తులు కూడా లేని తిరుమల... దర్శనానికి వెళుతున్న స్థానికులు


తిరుమల గిరులు భక్తులు లేక వెలవెల పోతున్నాయి. సర్వ దర్శనం కోసం కేవలం 2 కంపార్ట్ మెంట్లలో మాత్రమే భక్తులు వేచి వున్నారు. వీరికి మరో గంటలో దర్శనం అవుతుందని సమాచారం. ఆ తరువాత క్యూలలో కూడా ఎవరూ వుండే అవకాశాలు లేవని తెలుస్తోంది. దీంతో నిత్యం వివిధ రకాల వ్యాపారాలు చేసుకునే తిరుమల వాసులు శ్రీవారి దర్శనానికి వెళుతున్నారు. క్యూలలో నడుచుకుంటూ స్వామి సన్నిధికి వెళ్ళడానికి పట్టే సమయమే వీరికి దర్శనానికి పట్టే సమయం. కాగా, ముందుగా రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న సుమారు 2000 మంది సాయంత్రం లోగా వారికి కేటాయించిన సమయానికి దర్శనానికి వస్తారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News