: భారత క్రికెట్ జట్టుకు కొత్త దుస్తుల ఆవిష్కరణ
భారత క్రికెట్ జట్టు అధికారిక దుస్తుల స్పాన్సర్ అయిన 'నైకీ' ఆటగాళ్ల కోసం కొత్త దుస్తుల కిట్ ను నేడు ఆవిష్కరించింది. రేపటి నుంచి ప్రారంభమయ్యే ముక్కోణపు వన్డే సిరీస్ లో భారత ఆటగాళ్లు ఈ దుస్తులనే ధరించనున్నారు. మైదానంలో క్రికెటర్ల కదలికలను దృష్టిలో వుంచుకొని వారికి సౌకర్యంగా ఉండేలా, ఎంతో పరిశోధన చేసి ఈ దుస్తులను తయారుచేసినట్టు నైకీ పేర్కొంది. కాగా, కొత్త యూనిఫామ్ ఎంతో తేలికగా, సౌకర్యంగా ఉందని జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపారు. ఈ దుస్తులు భారతీయ క్రీడాస్ఫూర్తిని ప్రతిబింబిస్తున్నాయని ఆయన అన్నారు.