: పదోసారి... రెండు రూపాయలు తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధర!
నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన తరువాత పదోసారి ఇంధన ధరలు తగ్గనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి తగ్గడంతో, ఆ మేరకు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేందుకు ప్రభుత్వ రంగ ఇంధన విక్రయ సంస్థలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రం జరిగే సమీక్ష సమావేశంలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలను రూ.2 తగ్గిస్తూ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి దేశవాళి ధరల్లో మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే.