: మెదక్ జిల్లాలో పోలీసులపై దాడి... కాల్పుల కలకలం!


ఆవులను అక్రమ రవాణా చేస్తున్న దుండగులు నేటి ఉదయం మెదక్ జిల్లాలో హల్ చల్ చేశారు. ఏకంగా మూడు చెక్ పోస్ట్ లను దాటుకుని వెళ్లి, పోలీసుల వాహనాన్ని ఢీకొట్టి రాళ్ల దాడిచేశారు. దొంగలు రాళ్లు రువ్వడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సుమారు 15 మంది దొంగలు మిరుదొడ్డి మండలం భూంపల్లి వద్ద పశువులను అపహరించేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు దొంగలను వెంబడించారు. తప్పించుకున్న దొంగలు రామాయంపేట మీదుగా చేగుంటవైపు దారి మళ్లారు. సమాచారమందుకున్న చేగుంట పోలీసులు రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలపగా, దుండగులు వాహనాలను ఢీకొట్టి రాళ్ల దాడికి దిగారు. ఈ దాడిలో రాయాయంపేట కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. ఆపై పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడంతో దుండగులు మేడ్చల్ వైపు పరారయ్యారు. దుండగులు ప్రయాణించిన లారీని పేట్‌ బషీర్‌ బాద్ వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి ఘటనపై విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News