: ఇంటర్‌నెట్, వైఫై లేకుండానే అంతర్జాతీయ కాల్స్... ఇండియాలో తొలిసారి అందుబాటులోకి 'రింగో'
16 దేశాల్లో విజయవంతమైన స్మార్ట్ ఇంటర్ నేషనల్ కాలింగ్ యాప్ 'రింగో' భారతీయులకు అందుబాటులోకి వచ్చింది. ఈ రింగో యాప్‌తో ఇంటర్‌నెట్, వైఫై లేకుండానే అంతర్జాతీయ కాల్స్ చేసుకోవచ్చు. ఈ యాప్ వాడి ఐఎస్డీ కాల్స్ లో 90% పొదుపు చేయవచ్చని 'రింగో' యాజమాన్యం చెబుతోంది. ఉదాహరణకు భారత్ లోని రింగో యూజర్, ఇంగ్లాండ్ లోని వ్యక్తికి ఫోన్ చేయాలనుకున్నట్లైతే, రింగో ఇద్దరు యూజర్లకూ మధ్య వారధిగా నిలిచి లోకల్ కాల్ ను డయల్ చేస్తుంది. ఆపై ఇరువురిని కేరియర్ సర్క్యూట్ల ద్వారా అనుసంధానం చేస్తుంది. ప్రతియేటా 200 కోట్ల డాలర్లను భారతీయులు విదేశీ కాల్స్ కోసం వెచ్చిస్తున్న తరుణంలో ఈ యాప్ కు మంచి ఆదరణ ఉంటుందని అంచనా.