: పది రూపాయల నోట్లు విసిరి... పన్నెండు లక్షలు లేపేసిన దొంగ!


అధిక మొత్తంలో నగదు దగ్గరున్నప్పుడు అపరిచితుల మాటలు నమ్మవద్దని పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా, మనిషిలోని ఆశ దోపిడీల సంఖ్యను పెంచుతూనే ఉంది. తాజాగా, తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ప్రధాన రహదారిలో ఓ కారు వద్ద రూ.పది నోట్లు చల్లి, ఒక వ్యాపారి కన్నుగప్పిన దొంగ రూ.12 లక్షలతో ఉన్న బ్యాగ్‌ ను పట్టుకుని ఉడాయించాడు. హోటల్ వ్యాపారి కొండాపు సూర్యనారాయణరెడ్డి ఆర్థిక లావాదేవీల నిమిత్తం రూ.12 లక్షలతో రాగా ఈ ఘటన జరిగింది. కింద కనిపించిన 12 పది రూపాయల నోట్ల కోసం ఆశ పడ్డ సూర్యనారాయణరెడ్డిని ఏమార్చిన దుండగుడు కారులోని నగదు బ్యాగ్‌ తో పారిపోయాడు. చుట్టుపక్కల గాలించినా ఆగంతుకుడి జాడ లభించలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News