: వాషింగ్టన్ పై బాంబులతో, తుపాకులతో దాడికి కుట్ర... భగ్నం చేసిన పోలీసులు
అమెరికా రాజధాని వాషింగ్టన్ పై బాంబులతో, తుపాకులతో దాడి చేయాలని చేసిన కుట్రను ఒహియో పోలీసులు భగ్నం చేశారు. ఇస్లామిక్ స్టేట్ కు మద్దతుదారుగా ఉన్న క్రిస్టోఫర్ కార్నెల్ (20)ను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు దాడి కుట్రను కోర్టుకు తెలిపారు. నిందితుడి నుంచి సెమి- ఆటోమేటిక్ రైఫిల్, 600 రౌండ్ల తూటాలు, పైప్ బాంబులు స్వాధీనం చేసుకున్నట్టు ఎఫ్ బీఐ అధికారి ఒకరు వివరించారు. ఈ బాంబులు, మారణాయుధాలతో వాషింగ్టన్ కు వెళ్లి విధ్వంసం సృష్టించాలన్నది అతని ఆలోచనగా పేర్కొన్నారు.