: క్రికెట్ నుంచి తప్పుకున్న ఆస్ట్రేలియా పేస్ బౌలర్ బ్రెట్ లీ


తన బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టులోని బాట్స్ మెన్లను గడగడలాడించిన ఆస్ట్రేలియా పేస్ బౌలర్ బ్రెట్ లీ అన్ని క్రికెట్ ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. తన 20 సంవత్సరాల క్రికెట్ కెరీర్లో అన్ని దేశాలపైనా ఆడిన లీ 76 టెస్టులు, 221 వన్డేలు, 25 టీ-20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 718 వికెట్లను పడగొట్టాడు. వీటిల్లో 487 ఫస్ట్ క్లాస్, 438 లిస్ట్-ఏ, 105 టీ-20 వికెట్లు వున్నాయి. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తరపున బ్రెట్ లీ ఆడాడు. తన రిటైర్ మెంట్ విషయంలో కోచ్ సలహా అడిగానని, తనను అభిమానించిన క్రీడా ప్రియులకు కృతజ్ఞతలని లీ తెలిపాడు.

  • Loading...

More Telugu News