: శ్రావణి వల్లే చక్రి మరణం... ఫోన్ కాల్స్ సాక్ష్యం... తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు


ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి మరణంపై ఐపీసీ సెక్షన్ 174 కింద అనుమానాస్పద కేసుగా జూబ్లీహిల్స్ పోలీసులు కేసును నమోదు చేశారు. తన కోడలు శ్రావణి వల్లనే చక్రి చనిపోయాడని ఆయన తల్లి విద్యావతి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా తన కొడుకును చంపుతున్నానంటూ శ్రావణి రెండుసార్లు తనకు ఫోన్ చేసిందని, ఆ ఫోన్ కాల్‌ డేటాను పరిశీలిస్తే నిజానిజాలు బయటకు వస్తాయని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు చక్రి మరణాన్ని అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు.

  • Loading...

More Telugu News