: మరో కొత్త మార్గం!.. ఎలక్ట్రిక్ స్టవ్ లో బంగారం... శంషాబాద్ విమానాశ్రయంలో పట్టివేత
బంగారం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, అక్రమార్కులు కొత్త దారులు వెతుకుతున్నారు. హైదరాబాద్, శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం ఉదయం కస్టమ్స్ అధికారులు ఓ ప్రయాణికుడి నుంచి 1.5 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఎలక్ట్రిక్ స్టవ్, మైక్రోవేవ్ ఓవెన్ లో ఈ బంగారాన్ని దాచి తీసుకు వస్తుండగా దొరికిపోయాడు. చెన్నైకి చెందిన ఈ వ్యక్తి కౌలాలంపూర్ నుంచి వస్తున్నట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు ప్రయాణికుడిని పోలీసులకు అప్పగించారు.