: బానిసలను చేసి... రక్తం సేకరిస్తూ... ఉగ్రవాదుల కిరాతకాలు కళ్లకుకట్టిన యువతి


ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల క్రూరత్వానికి సంబంధించిన మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. గాయపడిన ఉగ్రవాదుల చికిత్సకు అవసరమయ్యే రక్తం కోసం వందల సంఖ్యలో మహిళలను బందీలుగా ఉంచారు. వారి నుంచి బలవంతంగా రక్తం సేకరిస్తున్నారని, కొందరి నుంచి రోజుకు రెండు, మూడు సార్లు రక్తం తీస్తున్నారని అక్కడి నుంచి తప్పించుకుని వచ్చిన ఓ యువతి తెలిపింది. మధ్య ప్రాశ్చ్య దేశాల సంస్కృతీ సంప్రదాయాలను పాటించే యాజిడి వర్గం మహిళలు ఐఎస్ ఉగ్రవాదుల లక్ష్యమని హంషీ అనే 19 ఏళ్ల యువతి బీబీసీకి వివరించింది. తనను, తన బిడ్డనూ 28 రోజుల పాటు బంధించారని ఆమె తెలిపారు. తన భర్తను, మామను, మరిదిని వారు హతమార్చారని తెలిపింది. యాజిడి వర్గం మహిళలను వెతికి పట్టుకొని వారిని బానిసలను చేస్తున్నారని ఆమె ఆరోపించారు. వీరిపై నిత్యం అత్యాచారాలు జరుగుతున్నాయని, శారీరకంగా హింసించి మత మార్పిడి చేయిస్తున్నారని తెలిపింది.

  • Loading...

More Telugu News