: భూమి సమీపానికి రానున్న భారీ గ్రహశకలం: నాసా


ఓ భారీ గ్రహశకలం ఈ నెల 26న భూమికి అత్యంత సమీపానికి రానుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పేర్కొంది. అయితే, దీనితో ఎలాంటి ప్రమాదం ఉండబోదని తెలిపింది. ఈ గ్రహశకలం అర కిలోమీటర్ వ్యాసంతో ఉందని, దీనికి 2004 బీఎల్ 86 అని పేరు పెట్టినట్టు తెలిపింది. భూమికి, చంద్రుడికి ఉన్న దూరానికి మూడు రెట్లు దూరంగా ఈ గ్రహశకలం పయనించనుందని, ప్రజలు స్పష్టంగా చూడవచ్చని పేర్కొంది. దీని ధూళి ప్రభావం కూడా భూమిపై ఏమీ ఉండదని స్పష్టం చేసిన నాసా, 1999లో ఏఎన్ 10 అనే శకలం భూమికి ఇంతే దూరం నుంచి దూసుకుపోయిందని వివరించింది.

  • Loading...

More Telugu News