: చెక్క భజన చేస్తూ, చిందేసిన చంద్రబాబు
చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్సాహంగా పాల్గొన్నారు. సంస్కృతీ సంప్రదాయాలు వెల్లివిరిసేలా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో కుటుంబీకులు, ప్రజలతో కలిసి ఆయన ఆడిపాడారు. చెక్క భజన చేస్తూ కాసేపు, కోలాటాలతో కాసేపు కాలక్షేపం చేసిన ఆయన అభిమానుల కోరిక మేరకు ఒక స్టెప్పు కూడా వేశారు. ఈ సంక్రాంతి నుంచి ప్రతి పేదవాడి కుటుంబంలో ఆనందం కనిపించాలని, రైతులకు మేలు జరగాలని చంద్రబాబు ఆకాంక్షించారు.