: భార్యలకు బురఖాలు లేవని భర్తలను క్రూరంగా హతమార్చిన ఐఎస్ ఉగ్రవాదులు
ముస్లిం మహిళలు పూర్తిగా బురఖాలను ధరించలేదని ఆరోపిస్తూ, వారి భర్తలను బహిరంగంగా కాల్చి చంపారు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు. కేవలం కళ్ళు మాత్రమే కనిపించేలా ఆఫ్ఘన్ తరహా బురఖాలను ధరించాలని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్) హుకుం జారీ చేసింది. ఆపై సాధారణ బురఖాలు ధరించిన ఐదుగురు మహిళలను గుర్తించి, వారి భర్తలను కిరాతకంగా కాల్చి చంపారు. ఆఫ్ఘన్ తరహా బురఖాలు ధరించకుంటే భర్తలందరికీ ఇదే గతి పడుతుందని వారు హెచ్చరించారు.