: యువతిని వేధించేందుకు ఏడు వందల యాభై ఫోన్ నంబర్లు మార్చిన ఘనుడు


తనను ప్రేమించాలంటూ గత ఆరేళ్లుగా సుమారు 750 మొబైల్ నంబర్ల నుంచి ఫోన్లు చేసి వేధించిన ఆకతాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన బీహార్ రాజధాని పాట్నాలో జరిగింది. బాధితురాలు మహిళా హెల్ప్ లైన్ ను ఆశ్రయించి, అతడి ఫోన్ నంబర్లను బ్లాక్ చేసినా కొత్త నంబర్ల నుంచి ఫోన్లు చేసేవాడని వివరించింది. చివరికి అతడి ఫోన్ నంబర్ కనిపెట్టి, బాధితురాలిని కలిసేందుకు రావాలని కబురుపెట్టి ఆపై అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు 750 ఫోన్ నంబర్లు వినియోగించినట్టు సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో తేలిందని మహిళా హెల్ప్ లైన్ అధికారి వివరించారు. భవిష్యత్తులో మళ్లీ వేధింపులకు దిగితే చర్య తప్పదని హెచ్చరించి, ఇంకెప్పుడూ ఫోన్ చేయనని, ఫోన్ నంబర్ మార్చనని అతడితో లేఖ రాయించి పంపారు.

  • Loading...

More Telugu News