: కృష్ణా జిల్లాలో భూకంపం... పరుగులు తీసిన ప్రజలు
సంక్రాంతి పర్వదినాన తెల్లవారుజామున తమ ఇళ్ల ముందు రంగవల్లులు అద్దుతూ సంబరాలు చేసుకుంటున్న వారంతా ఒక్కసారిగా అదిరిపడ్డారు. కృష్ణా జిల్లా కంచికచర్ల సమీపంలో స్వల్ప భూకంపం సంభవించింది. ఉదయం 5:37 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. భూమి రెండు సెకన్ల పాటు కంపించినట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతంలోని ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.