: మేడమ్! పదవి నుంచి తప్పుకోండి!: సోనియాకు సూచించిన దిగ్విజయ్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాలంటూ సోనియాగాంధీకి ఆ పార్టీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ సూచించారు. అధ్యక్ష పదవి నుంచి తప్పుకుని, సలహాదారుగా పార్టీకి సేవలందించాలని కూడా సలహా ఇచ్చారు. పార్టీ పూర్తి బాధ్యతలను రాహుల్ గాంధీ చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని, అధ్యక్ష పదవిని రాహుల్ కు అప్పగించాలని కోరారు. పార్టీని పునరుత్తేజం చేయాల్సిన బాధ్యత రాహుల్ పై ఉందని డిగ్గీ రాజా అన్నారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టే వయసు రాహుల్ కు ఇంకా రాలేదన్న వాదనలను ఖండించిన ఆయన... 38 ఏళ్ల వయసులోనే జవహర్ లాల్ నెహ్రూ, 35 ఏళ్ల వయసుకే మౌలానా ఆజాద్ కాంగ్రెస్ అధ్యక్షులు అయ్యారన్న విషయాన్ని గుర్తు చేశారు.