: పాక్ వెబ్ సైట్లకు అమీర్ ఖాన్ లీగల్ నోటీసులు


కొన్ని పాకిస్థానీ వెబ్ సైట్లకు ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ లీగల్ నోటీసులు పంపారు. సూపర్ హిట్ అయిన తాజా చిత్రం 'పీకే'కు సంబంధించి... మతపరమైన కల్పిత ఇంటర్వ్యూని కొన్ని వెబ్ సైట్లలో పోస్ట్ చేశారు. దీనిపై అమీర్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసును టేకప్ చేసిన 'డీఎన్ కే లీగల్' అనే సంస్థ... అమీర్ ఖాన్ మతపరమైన ఇంటర్వ్యూని ఎవరికీ, ఎన్నడూ ఇవ్వలేదని తెలిపింది. కల్పితమైన ఇంటర్వూని పాక్ వెబ్ సైట్లు పోస్ట్ చేశాయని... వాటన్నింటికీ లీగల్ నోటీసులు జారీ చేశామని వెల్లడించింది.

  • Loading...

More Telugu News