: గంగానది శుద్ధి ఈ టర్మ్ లో పూర్తవుతుందా? మరో టర్మ్ కావాలా?: కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు
గంగానదిని శుద్ధి చేయడంలో జరుగుతున్న అలసత్వంపై కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిలదీసింది. గంగను శుద్ధి చేయడానికి ఈ టర్మ్ (ఐదేళ్లు) సరిపోతుందా? లేక, మరో టర్మ్ కావాలా? అంటూ సూటిగా ప్రశ్నించింది. దీనికి సమాధానంగా, 2018 నాటికి గంగ శుద్ధిని పూర్తి చేస్తామని సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ కోర్టుకు తెలిపారు. విచారణ సందర్భంగా, గత 30 ఏళ్ల నుంచి గంగానది శుద్ధి కోసం రూ. 2 వేల కోట్లను ఖర్చు చేసిన విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానం గుర్తు చేసింది. గంగానది శుద్ధికి మోదీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే.