: తిరుపతి ఉపఎన్నిక అభ్యర్థిగా సుగుణమ్మ పేరును ఖరారు చేసిన చంద్రబాబు
ఎమ్మెల్యే వెంకటరమణ మృతితో తిరుపతి శాసనసభ స్థానానికి ఉపఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలైంది. ఈ నేపథ్యంలో, టీడీపీ అభ్యర్థిగా సుగుణమ్మ పేరును టీడీపీ అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. సుగుణమ్మ దివంగత వెంకటరమణ సతీమణి. ఈ సందర్భంగా సుగుణమ్మ మాట్లాడుతూ, తన భర్త అడుగుజాడల్లో నడుస్తూ, నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతానని... భర్త ఆశయాలను నెరవేరుస్తానని తెలిపారు. ఈ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగే అవకాశం ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైనా మరణించినప్పుడు, వారి కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా టికెట్ ఇస్తే... పోటీకి నిలపకూడదనే సంప్రదాయాన్ని అన్ని పార్టీలు పాటిస్తున్న సంగతి తెలిసిందే.