: రేపు ఢిల్లీకి వెళుతున్న చంద్రబాబు... ప్రధాని, పలువురు మంత్రులతో భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఉదయం ఢిల్లీకి వెళుతున్నారు. పర్యటనలో భాగంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. రేపు ఉదయం 10 గంటలకు నిర్మల సీతారామన్, మధ్యాహ్నం 2 గంటలకు ఉమాభారతి, 3 గంటలకు రాధామోహన్ సింగ్ తో ఆయన భేటీ అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై కేంద్ర మంత్రులతో చంద్రబాబు చర్చిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో సమావేశమవుతారు. ఏపీకి ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణానికి నిధులను ఈ సందర్భంగా చంద్రబాబు కోరనున్నారు. దీనికితోడు, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన వివిధ హామీలను కూడా గుర్తు చేసే అవకాశం ఉంది.