: కాసేపట్లో 'మకర జ్యోతి' దర్శనం
పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప భక్తుల శరణు ఘోషతో మారుమోగుతోంది. కాసేపట్లో మకర జ్యోతి దర్శనం ఇవ్వబోతోంది. జ్యోతి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు శబరిమలపై వేచి చూస్తున్నారు. స్వామియే శరణం అయ్యప్ప అంటూ స్మరించుకుంటూ భక్తులు భక్తిభావంలో మునిగితేలుతున్నారు. సాయంత్రం 6.30 గంటలకు దీపారాధన కార్యక్రమం జరగింది. అనంతరం 6.45కు పుష్పాభిషేకం ప్రారంభమైంది.