: కేంద్ర మంత్రి నఖ్వీకి ఏడాది జైలు శిక్ష... బెయిల్ మంజూరు
కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీకి ఉత్తరప్రదేశ్ రాంపూర్లోని ఓ కోర్టు ఏడాది జైలు శిక్షను విధించింది. 2009 ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘించారన్న ఆరోపణలతో ఆయనపై అప్పట్లో కేసు నమోదైంది. దీన్ని విచారించిన కోర్టు ఆయనకు ఏడాది శిక్షను ఖరారు చేసింది. దీంతో, పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అయితే, బెయిల్ కోసం నఖ్వీ చేసుకున్న అప్పీలును పరిశీలించిన కోర్టు... వెంటనే ఆయనకు బెయిల్ ను మంజూరు చేసింది.