: లష్కరే తోయిబా అగ్రనేతను కాల్చి చంపిన సైన్యం


ఇండియాలో అందునా కాశ్మీర్ ప్రాంతంలో ప్రభుత్వానికి, భద్రతా దళాలకూ కునుకు లేకుండా చేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన కీలక నేతను భారత సైన్యం నేడు హతమార్చింది. ఉత్తర కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లా సోపోరే పట్టణంలో ఈ రోజు జరిగిన ఎన్ కౌంటర్ లో ఉగ్రవాద నేత ఒకరు మృతి చెందినట్టు పోలీసులు ప్రకటించారు. భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య దాదాపు ఆరు గంటల పాటు ఎదురు కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తిని లష్కరే తోయిబాకు చెందిన అగ్రనేతగా గుర్తించిన పోలీసులు, అతని వద్ద నుంచి ఏకే-47 తుపాకీతో పాటు మరికొన్ని మారణాయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. హతమైన ఉగ్రవాది వివరాలను వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు.

  • Loading...

More Telugu News