: ఆ దాడి మా పనే: అల్ ఖైదా


ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నగరం లో వ్యంగ్య వార్తాపత్రిక చార్లీ హెబ్డోపై తమ వీరులు దాడి చేశారని ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా ప్రకటించింది. ఈ మేరకు యెమెన్ లో అల్ ఖైదా నేతలు యూట్యూబ్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. మహ్మద్ ప్రవక్తను అవమానించినందుకే ఈ దాడి చేసినట్లు వారు తెలిపారు. ప్యారిస్ మీద తాము పవిత్ర యుద్ధం చేశామని, దీనికి అరేబియన్ ద్వీపకల్పంలోని అల్ ఖైదా అల్ జిహాద్ బాధ్యత తీసుకుంటోందని, దైవదూతను దూషించినందుకు ప్రతీకారంగానే ఈ ఆపరేషన్ చేపట్టామని ఆ సంస్థ యెమెన్ శాఖకు చెందిన నేత నాజర్ అలీ అల్ అన్సీ ఈ వీడియోలో తెలిపాడు.

  • Loading...

More Telugu News