: గ్రామీణ ప్రాంతాల్లో కూడా కార్పొరేట్ వైద్యం అందాలి: గవర్నర్


గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అందుతున్న వైద్యంపై గవర్నర్ నరసింహన్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. కార్పొరేట్ ఆసుపత్రులు నగరాల్లోనే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో సైతం వైద్య సేవలను అందించాలని సూచించారు. మెరుగైన వైద్యం అందక గ్రామీణ ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. 20 వేల కార్నియా మార్పిడులతో రికార్డు సృష్టించిన ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల నిపుణులను గవర్నర్ ఈ రోజు సన్మానించారు. కంటి చూపును ప్రసాదించడమంటే... ప్రపంచానికి వెలుగునివ్వడమే అని చెప్పారు.

  • Loading...

More Telugu News