: ఇక్కడ సునామీ రావచ్చు... ఎన్టీపీసీకి షాకిచ్చిన పర్యావరణ శాఖ
విశాఖ జిల్లా పూడిమడక ప్రాంతంలో సునామీలు వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తూ, అక్కడ నిర్మించదలచిన విద్యుత్ కేంద్రాన్ని మరో ప్రాంతానికి మార్చాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. విద్యుత్ కేంద్రం నిర్మాణానికి పూడిమడక అనుకూలం కాదని తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ, పర్యావరణశాఖ నివేదిక సమర్పించింది. ఈ నిర్ణయం పూడిమడకలో 4 వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రానికి సన్నాహాలు చేస్తున్న ఎన్టీపీసీకి షాక్ ను కలిగించేదే. పర్యావరణ శాఖ నివేదికను ఆమోదించిన కేంద్రం విద్యుత్ కేంద్రం మార్పుపై చర్యలు చేపట్టాలని ఆదేశించింది.