: ఢిల్లీలో క్రైస్తవ ప్రార్థనాలయాలపై దాడులు... ఓ చర్చి ధ్వంసం
దేశ రాజధాని ఢిల్లీలో నేటి తెల్లవారుజామున క్రైస్తవులకు చెందిన ప్రార్థనాలయాలపై దాడులు జరిగాయి. గుర్తు తెలియని దుండగులు పాల్పడిన ఈ దాడుల్లో ఓ చర్చి ధ్వంసమైంది. ‘‘తెల్లవారుజామున 4.20 గంటలకు బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు చర్చిలో విధ్వంసం సృష్టించారు. చర్చి కిటికీ బద్దలు కొట్టిన ఓ వ్యక్తి చర్చిలో ప్రవేశించాడు. అక్కడున్న మదర్ మేరీ విగ్రహాన్ని విసిరేశాడు’’ అని చర్చి పాదర్ చెప్పారు. దుండగులు జరిపిన దాడి దృశ్యాలన్నీ చర్చిలో ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దాడి చేసిన వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే, నగరంలోని మరో రెండు చర్చిలపై దాడులు జరిగాయన్న వదంతులు కలకలం రేపుతున్నాయి.