: బట్టలు చించుకుని తప్పుడు కేసులు పెట్టే రకం... తృణమూల్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు


‘వాళ్ల జాకెట్లు వాళ్ళే స్వయంగా చించుకుంటారు. నానా గొడవ చేస్తారు. అవతలి వాళ్లపై తప్పుడు అత్యాచారం కేసులు పెడతారు’ అంటూ సీపీఎం మహిళా విభాగం కార్యకర్తలపై తృణమూల్ మంత్రి స్వపన్ దేవ్ నాథ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని లేపాయి. మమత ప్రభుత్వంలో చిన్న పరిశ్రమలు, వస్త్ర శాఖ సహాయమంత్రిగా పనిచేస్తున్న స్వపన్ బర్ద్వాన్ ప్రాంతంలో జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడుతూ, విపక్షంలోని చాలామంది మహిళా కార్యకర్తలు అధికారపక్షం మీద కేసులు పెట్టడానికి తమ దుస్తులు తామే చించుకుంటున్నారని అన్నారు. ఇంట్లో భర్తతో గొడవపడి దెబ్బలు తిన్నా కూడా బయటికొచ్చి తృణమూల్ నేతల మీద అత్యాచార, వేధింపుల కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో దుమారం రేపుతున్నాయి.

  • Loading...

More Telugu News