: రైతులు సుఖశాంతులతో వర్ధిల్లాలి: పవన్ కల్యాణ్ సంక్రాంతి శుభాకాంక్షలు


తెలుగు రాష్ట్రాల ప్రజలకు టాలీవుడ్ ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు నేటి ఉదయం ఆయన ప్రకటన విడుదల చేశారు. రైతులు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. సినీ నటుడిగానే కాక ఇటీవల రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన పవన్ కల్యాణ్ నుంచి వెలువడే ప్రతి ప్రకటన తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి రేపుతోంది. పరిణతి చెందిన రాజకీయవేత్తలా ఆయన చేస్తున్న ప్రకటనలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే సంక్రాంతి శుభాకాంక్షల్లో రైతులను ప్రధానంగా ప్రస్తావించిన ఆయన, రైతుల కుటుంబాల్లో సుఖశాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News