: కాశ్మీర్లో భవనాన్ని ఆక్రమించిన తీవ్రవాదులు... కొనసాగుతున్న ఎన్ కౌంటర్


పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు మరోసారి విరుచుకుపడ్డారు. జమ్మూ కాశ్మీర్, బారాముల్లా జిల్లాలోని సోపోర్ ప్రాంతంలో ఓ భవంతిని తీవ్రవాదులు ఆక్రమించారు. దీంతో, ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా, దాన్ని గమనించిన తీవ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులకు దిగారు. దాంతో ఇరువైపులా హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా తీవ్రవాదులను ఏరివేస్తామని పోలీసు అధికారి ఒకరు వివరించారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సివుంది.

  • Loading...

More Telugu News