: అదృశ్యమైన సింగపూర్ ప్రతినిధుల ల్యాప్ టాప్ లభ్యం!
సింగపూర్ ప్రతినిధుల ల్యాప్ టాప్ ను తిరుమల పోలీసులు ఎట్టకేలకు కనుగొన్నారు. నిన్న ఏపీ పర్యటనకు వచ్చిన సింగపూర్ ప్రతినిధులు సీఎం చంద్రబాబునాయుడితో కలిసి తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రతినిధి బృందానికి చెందిన ఓ ల్యాప్ టాప్ మాయమైంది. దీనిపై సింగపూర్ ప్రతినిధులు తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిన్న రాత్రి నుంచి సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. నేటి ఉదయం ఓ వాహనంలో సదరు ల్యాప్ టాప్ ను గుర్తించిన పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు.