: మా తడాఖా ఏంటో చూపిస్తాం... పాక్ కు భారత్ హెచ్చరికలు
సరిహద్దుల్లో పాకిస్థాన్ ఆగడాలను గట్టిగా తిప్పికొడతామని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. ఎల్ఓసీ వెంబడి ఉద్రిక్త పరిస్థితిని అదుపు చేయడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని, ఆరు నెలల వ్యవధిలో భారత్ తడాఖా ఏంటో పాక్ కు తెలిసేలా చేస్తామని ఆయన హెచ్చరించారు. పాకిస్థాన్ కాల్పుల ఒప్పందాన్ని పలుమార్లు ఉల్లంఘించిందని, మిలిటెంట్ల చొరబాట్లకు సంబంధించి తాము చేతులు కట్టుకుని కూర్చోబోమని ఆయన స్పష్టం చేశారు. సరిహద్దుల్లో జరుగుతున్నదేమిటో ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసన్న పారికర్, ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చిందని, ఆరు నెలల వ్యవధిలో తీసుకునే చర్యలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో అందరూ చూస్తారని ఆయన అన్నారు.