: రేణిగుంట భోగి వేడుకల్లో ఆకతాయి ఆగడం...వాహనాలు, షాపునకు నిప్పు


చిత్తూరు జిల్లా రేణిగుంట భోగి వేడుకల్లో ఓ ఆకతాయి యువకుడు విధ్వంసం సృష్టించాడు. భోగి మంటల సందర్భంగా స్వైరవిహారం చేసిన సదరు ఆకతాయి ఓ పల్సర్ బైక్ తో పాటు కారుకు నిప్పంటించాడు. అంతటితో ఆగని అతడు అక్కడికి సమీపంలో ఉన్న ఓ మిక్సీ రిపేరీ షాపునకు కూడా నిప్పు పెట్టాడు. ఈ ఘటనలో కారు, బైక్ తో పాటు రిపేరీ షాపు కూడా పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఆకతాయి యువకుడిని అదుపులోకి తీసుకునేందుకు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News