: తడ కండ్రిగ భోగి వేడుకల్లో మహిళల ఘర్షణ... మహిళ మృతి
నెల్లూరు జిల్లా భోగి వేడుకల్లో నేటి ఉదయం విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని తడ మండలం తడ కండ్రిగ భోగి వేడుకల్లో మహిళల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. భోగి మంటల సందర్భంగా నెలకొన్న ఘర్షణ నేపథ్యంలో మహిళల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. ఈ ఘర్షణలో మునెమ్మ అనే మహిళ మృతి చెందింది. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణంతో పాటు విషాదం నెలకొంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఘటనపై విచారణ చేపట్టారు.