: సొంతూరులో ఏపీ సీఎం చంద్రబాబు... పసుపుమయంగా నారావారిపల్లె!


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు నారావారిపల్లె మొత్తం పసుపుమయంగా మారిపోయింది. నిన్న రాత్రి సీఎం చంద్రబాబు తన సొంతూరు చేరుకున్నారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు ఆయన స్వగ్రామం చేరుకున్న సంగతి తెలిసిందే. నిన్న వివిధ ప్రాంతాల్లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో మునిగితేలిన చంద్రబాబు, రాత్రికి సొంతూరు నారావారిపల్లె చేరుకున్నారు. అంతకుముందే ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కొడుకు లోకేశ్, కోడలు బ్రాహ్మణి గ్రామానికి చేరుకున్నారు. నిన్న రాత్రి గ్రామంలో జరిగిన వేడుకల్లో భువనేశ్వరి పాల్గొన్నారు. నేటి సంక్రాంతి సంబరాల్లో భాగంగా చంద్రబాబు, తన సోదరుడు రామ్మూర్తినాయుడు కుమారుడు, టాలీవుబ్ ప్రముఖ నటుడు నారా రోహిత్ తాజా చిత్రం టీజర్ ను విడుదల చేస్తారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాలుపంచుకునే ఆయన గ్రామస్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో గ్రామంలో పెద్ద ఎత్తున బ్యానర్లు వెలిశాయి. నేటి రాత్రి కూడా ఆయన స్వగ్రామంలోనే గడిపే అవకాశాలున్నాయి. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News