: అవధులు లేని ఆనందానినికి భోగి నాంది పలకాలి: ప్రధాని మోదీ శుభాకాంక్షలు
భోగిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అవధులు లేని ఆనందానికి భోగి నాంది పలకాలని ఆయన తన సందేశంలో ఆకాంక్షించారు. ప్రజలందరికి భోగి సుఖసంతోషాలను ఇవ్వాలని ఆయన అభిలషించారు. సంక్రాంతిని పురస్కరించుకుని నిన్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఢిల్లీలోని తన నివాసంలో నిర్వహించిన సంబరాలకు తన కేబినెట్ సహచరులు, పార్టీ నేతలతో కలిసి మోదీ హాజరైన సంగతి తెలిసిందే. సంబరాలను ఆస్వాదించిన తర్వాత ఆయన నిన్న రాత్రి తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షులు తెలుపుతూ తన ట్విట్టర్ లో పోస్టింగ్ లు పెట్టారు.