: ఆర్టీసీ బస్సులో షార్ట్ సర్క్యూట్... డ్రైవర్ చాకచక్యంతో తప్పిన పెనుముప్పు
ప్రమాదాలకు గురవుతున్న ఆర్టీసీ బస్సుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. మడకశిర ప్రమాదాన్ని మరువకముందే అనంతపురం జిల్లాలో మరో పెను ప్రమాదం డ్రైవర్ అప్రమత్తతతో తప్పింది. బెంగళూరు నుంచి అనంతపురం వస్తున్న బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అయితే అప్రమత్తంగా వ్యవహరించిన డ్రైవర్ చాకచక్యంగా బస్సును నిలిపపేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా భయపడ్డ ప్రయాణికులు డ్రైవర్ చాకచక్యంతో ఊపిరి పీల్చుకున్నారు. అనంతపురం జిల్లా పెనుగొండ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.