: తిరుపతి అర్బన్ ఎస్పీపై చంద్రబాబు ఆగ్రహం... కాన్వాయ్ ఆలస్యంపై ఫైర్!


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తిరుపతి అర్బన్ ఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలకు కాన్వాయ్ చేరుకోవడంలో జరిగిన జాప్యంపై ఆయన ఎస్పీపై చిందులేశారు. సింగపూర్ ప్రతినిధి బృందంతో కలిసి తిరుమల చేరుకున్న చంద్రబాబు వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సింగపూర్ ప్రతినిధులు తిరుగు ప్రయాణం సమీపిస్తున్న నేపథ్యంలో కేవలం 20 నిమిషాల్లో చంద్రబాబు తిరుమల పర్యటనను ముగించారు. వెంకన్న దర్శనాన్ని కూడా ఆయన హడావిడిగా ముగించుకున్నారు. ఈ క్రమంలో ఆయన వెళ్లే కాన్వాయ్ రాకలో కాస్త జాప్యం జరిగింది. దీంతో ఒక్కసారిగా అసహనానికి గురైన చంద్రబాబు అర్బన్ ఎస్పీపై కేకలేశారు.

  • Loading...

More Telugu News