: బోరుబావిలో నాలుగేళ్ల బాలిక... రంగారెడ్డి జిల్లాలో ఘటన


రంగారెడ్డి జిల్లా గండీడు మండలం గోవిందపల్లిలో విషాదం చోటుచేసుకుంది. పొలం వద్ద ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలిక ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయింది. తల్లిదండ్రులతో కలిసి పొలానికి వెళ్లిన ఆ బాలిక బోరుబావిలో పడిపోయింది. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. సమాచారం అందుకున్న అధికార యంత్రాంగం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుంటోంది. బాలికను క్షేమంగా బయటకు తీసేందుకు చర్యలు ప్రారంభిస్తున్నారు. ఓ వైపు సంక్రాంతి సంబరాలు మొదలవుతున్న నేపథ్యంలో ఈ ఘటనతో బాలిక కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

  • Loading...

More Telugu News