: ఏలూరులో వేడుకగా సంక్రాంతి సంబరాలు... కబడ్డీ ఆడిన మంత్రులు కామినేని, పీతల
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సంక్రాంతి సంబరాలను అధికారిక సంబరాలుగా ప్రకటించిన ప్రభుత్వం, వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తోంది. విశాఖ సంత్రాంతి సంబరాల్లో చంద్రబాబు సందడి చేయగా, ఏలూరులో మంత్రులు తమ హోదాలను పక్కనబెట్టి చిన్న పిల్లల్లా వేడుకల్లో ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగిన సంక్రాంతి సంబరాల్లో మంత్రులు కామినేని శ్రీనివాస్, పీతల సుజాతలు సరదాగా కబడ్డీ ఆడి వేడుకలకు మరింత ఉత్సాహాన్నిచ్చారు. మహిళలు, పురుషులు కలిసి ఆడిన ఈ కబడ్డీ వేడుకలు అక్కడి ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి.