: చెల్లని రూపాయికి గీతలెక్కువ... పొన్నాలకు మాటలెక్కువ: హరీశ్ రావు
-FB_8789.jpg)
టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యపై తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. కంటోన్మెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు, పొన్నాలను చెల్లని రూపాయితో పోల్చారు. పదేళ్ల పాటు మంత్రిగా కొనసాగిన పొన్నాల, ఏనాడైనా జనగామలో బస చేశారా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో పొన్నాల సీమాంధ్రుల పల్లకీ మోశారన్నారు. సమ్మక్క సారలమ్మ జాతరలో నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాళ్లు పట్టుకున్న చరిత్ర పొన్నాలదని విమర్శించారు. పొన్నాల వైఖరి నచ్చకనే టీ కాంగ్రెస్ నేతలు ఆ పార్టీని వీడుతున్నారని హరీశ్ రావు ఆరోపించారు. కంటోన్మెంట్ లో జెండాను ఎగురవేసిన తాము జీహెచ్ఎంసీపైనా గులాబీ జెండాను రెపరెపలాడిస్తామని పేర్కొన్నారు.