: తిరుమలకు చంద్రబాబు... అటు నుంచి నారావారిపల్లెకు!


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడనుంచి నేరుగా తిరుమల వెళ్లనున్న చంద్రబాబు, వెంకన్నను దర్శించుకుని తన సొంతూరు నారావారిపల్లెకు చేరుకుంటారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా బిజీ షెడ్యూల్ నేపథ్యంలో బెజవాడ, తిరుపతి కార్యక్రమాలను రద్దు చేసుకున్న చంద్రబాబు వెంకన్న దర్శనానికే ప్రాధాన్యతనిచ్చారు. సొంతూరు నారావారిపల్లెలో చంద్రబాబు సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. నేటి ఉదయం విశాఖకు వెళ్లిన చంద్రబాబు అక్కడి నుంచి నేరుగా రేణిగుంట చేరుకున్నారు.

  • Loading...

More Telugu News