: వెంకయ్య ఇంట్లో సంక్రాంతి సంబరాలు... ఎంజాయ్ చేసిన ప్రధాని, కేంద్ర మంత్రులు!
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు నివాసంలో సంక్రాంతి సంబరాలు వేడుకగా జరిగాయి. ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో నేటి మధ్యాహ్నం జరిగిన ఈ వేడుకలకు పలువురు కేంద్ర మంత్రులతో పాటు పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వెంకయ్య ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలుగు సంక్రాంతి వేడుకలను మంత్రులు, పార్టీ ప్రముఖులు బాగానే ఎంజాయ్ చేశారట. ఈ వేడుకలకు హాజరైన వారిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, సురేష్ ప్రభు తదితరులున్నారు.