: కంటోన్మెంట్ కోటపై గులాబీ జెండా... నాలుగు వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల విజయకేతనం


కొత్త రాష్ట్రం తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి, సికింద్రాబాద్ పరిధిలోని కంటోన్మెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. కంటోన్మెంట్ లోని ఎనిమిది వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. మొత్తం ఎనిమిది వార్డుల్లో నాలుగు వార్డులను టీఆర్ఎస్ గెలుచుకోగా మరో రెండు వార్డుల్లో ఆ పార్టీకి చెందిన రెబల్ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. పార్టీ పేరిటే సగం స్థానాలను గెలుచుకున్న ఆ పార్టీ కంటోన్మెంట్ పాలనా పగ్గాలను చేజిక్కించుకోనుంది. ఇందులో భాగంగా పార్టీ టికెట్ల నిరాకరణతో రెబల్స్ గా బరిలోకి దిగి విజయం సాధించిన ఇద్దరు అభ్యర్థులతో మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, పద్మారావులు మంతనాలు సాగిస్తున్నారు. ఎన్నికల్లో టీడీపీ తుడిచిపెట్టుకుపోగా, కాంగ్రెస్ కు ఒకే ఒక్క స్థానం దక్కింది. మరో స్థానంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి విజయం సాధించారు.

  • Loading...

More Telugu News