: డ్యాన్స్ చేసిన చంద్రబాబు... ఎంజాయ్ చేసిన సింగపూర్ మంత్రి
ఈ రోజు విశాఖలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ కార్యక్రమానికి సింగపూర్ బృందంతో కలసి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులతో చంద్రబాబు కాలు కదిపారు. చాలా ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న చంద్రబాబును చూసి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ చాలా ఎంజాయ్ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను తిలకించారు. ఆ తర్వాత పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశానికి వీరు హాజరయ్యారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత... సింగపూర్ బృందంతో కలసి చంద్రబాబు విశాఖ నుంచి విజయవాడ బయలుదేరారు. విమానంలోనే వీరు భోజన కార్యక్రమాలను ముగించారు.