: ముగిసిన వీబీ రాజేంద్రప్రసాద్ అంత్యక్రియలు
ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు వీబీ రాజేంద్రప్రసాద్ అంత్యక్రియలు ఎర్రగడ్డ శ్మశానవాటికలో పూర్తయ్యాయి. పలువురు సినీ రంగ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ మధ్యాహ్నం ఫిలిం ఛాంబర్ వద్ద వీబీ భౌతికకాయాన్ని అభిమానుల దర్శనార్థం కాసేపు ఉంచారు. అనంతరం ఎర్రగడ్డ శ్మశాన వాటికకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అంత్యక్రియలకు హాజరైన సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు, అభిమానులు వీబీని కడసారి దర్శించుకుని కన్నీరు పెట్టారు. ఒక మహా అధ్యాయం ముగిసిందని ఆవేదన చెందారు.