: జోరందుకున్న కోడిపందాలు... కృష్ణా జిల్లాలో చేతులు మారుతున్న లక్షలు!


సుప్రీంకోర్టు తీర్పు కోస్తాంధ్ర జిల్లాల్లో కొత్త ఉత్తేజాన్ని నింపినట్టుంది. సంక్రాంతి సంబరాలకు తెర లేవకముందే అక్కడ కోడిపందాలు జోరందుకున్నాయి. నిన్న కోర్టు తీర్పు వెలువడిన సమయం నుంచే రంగంలోకి దిగిన పందెంరాయుళ్లు లక్షల రూపాయల్లో పందాలు కాస్తూ యమ బిజీగా గడుపుతున్నారు. దీంతో ఆ ప్రాంత పల్లెల్లో ఈ ఏడాది కాస్త ముందుగానే సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. కృష్ణా జిల్లాలో ఈ తరహా జోరు గంటగంటకూ పెరుగుతోంది. గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ కోడిపందాల జోరు ఇప్పుడిప్పుడే మొదలవుతోంది.

  • Loading...

More Telugu News